నాలాలపై నిర్లక్ష్యం
వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని ప్రదర్శిస్తోంది. సకాలంలో నిధులు మంజూరు చేసి నాలా కష్టాలు దూరం చేయాల్సిన రేవంత్ సర్కారు మూడేండ్లుగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు.
సిటీబ్యూరో: వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని ప్రదర్శిస్తోంది. సకాలంలో నిధులు మంజూరు చేసి నాలా కష్టాలు దూరం చేయాల్సిన రేవంత్ సర్కారు మూడేండ్లుగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. బడ్జెట్ కేటాయింపులన్నీ కాగితాలకే పరిమితం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్ సిటీ ప్రాజెక్టు కింద రూ.2,650 కోట్ల మేర నిధులు బడ్జెట్లో కేటాయించగా..ఇప్పటి వరకు కనీసం నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం. ఈ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో పనులు అర్థాంతరంగా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల ఫేజ్- 2 పనుల ప్రతిపాదనలు టెండర్ల దశ దాటడం లేదు. అన్నింటి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం పురోగతిలో ఉన్న మొదటి దశ పనులను పూర్తి చేయలేకపోగా…రెండో దశ పనులను పూర్తి స్థాయిలో పట్టాలెక్కించ లేదు. మొదటి దశ పురోగతిలో ఉన్న ఏ ఒక్క చోట పూర్తి చేయలేకపోవడం, రెండో దశలో 57.401 కిలోమీటర్లలో రూ.667.28కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించి ఇప్పటికీ చాలా వరకు టెండర్ల దశలోనే కాలయాపన చేస్తున్న తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

