‘నూతన భూసేకరణ చట్టం’తో న్యాయం చేయాలి
పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టును చేపట్టడం కంటే భూసేకరణ వ్యవహారాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.
- 150 ఫీట్లకు తగ్గించాల్సిందే..
- ఎలివేటెడ్ కారిడార్ బాధితుల స్పష్టీకరణ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ) : పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రాజెక్టును చేపట్టడం కంటే భూసేకరణ వ్యవహారాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.
కొత్త భూసేకరణ చట్టం-2013 ప్రకారంతో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అలాగే వెడల్పు 150 ఫీట్లకు తగ్గించాలంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం విలువైన భూములను లాక్కోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఏడాదిన్నర గడిచినా తట్టెడు మట్టి తీయలేదు.
150 ఫీట్లకు..
భూసేకరణలో స్పష్టత ఇవ్వకపోవడం..పరిహారంలో పారదర్శకత లేకుండా ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుతో ఎలివేటెడ్ కారిడార్ బాధితులు విసిగిపోతున్నారు. న్యాయం కావాలని వందలాది మంది ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇప్పటికీ ప్రాజెక్టును ప్రతిపాదించి ఏండ్లు గడుస్తున్నా… కనీసం భూసేకరణ పూర్తి కాలేదు. దీనికి ప్రధాన కారణం భూసేకరణ పరిహారం తేల్చకుండా ప్రభుత్వం భూ సేకరణ నోటీసులు జారీ చేయడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దీంతోపాటు 200 ఫీట్ల నుంచి 150 ఫీట్లకు ప్రాజెక్టు వెడల్పును తగ్గించిన తర్వాతే పరిహారం కూడా చర్చిస్తామని కూడా స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం ఈ రెండు అంశాలపై స్పష్టత ఇవ్వకుండానే ఏడాది కాలంగా కాలయాపన చేస్తోంది. ఈ కారణంగానే ప్రాజెక్టులో పురోగతి లేకపోగా, బాధితులు ఎలివేటెడ్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రాజీవ్ రహదారి భూ నిర్వాసితుల జేఏసీ ఆధ్వర్యంలోనే సామూహిక నిరసనలు, ఆందోళనలతో బాధితులు ప్రతిఘటిస్తున్నారు.
పరిహారంపై క్లారిటీ ఏదీ..?
ప్రభుత్వం భూసేకరణ పరిహారాన్ని తేల్చకుండా ఇంటింటికీ నోటీసులు అంటించడం, కూల్చివేతలకు ఆస్తులను గుర్తించడంతో బాధితులు కోర్టులను ఆశ్రయించడంతో ఇటీవల జరిగిన భూసేకరణపై ప్రభుత్వం డైలామాలో పడింది. కొత్త భూసేకరణ చట్టం-2013 ప్రకారంతో తమకు న్యాయం చేయాలని, అదేవిధంగా ప్రాజెక్టు వెడల్పును కూడా కచ్చితంగా 150 ఫీట్లకు తగ్గించిన తర్వాతే ప్రాజెక్టుకు భూములు ఇవ్వడంపై చర్చిస్తామని బాధితులు చెబుతున్నారు.
గతంలో నగరంలో నిర్మించిన మెట్రో సంస్థకు కూడా ఇదే తీరుగా పరిహారం చెల్లించారని, దీంతోనే తమకు లాభం జరుగుతుందని జేఎసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నామామాత్రపు పరిహారంతో భూములు సేకరించాలని చూడటమే ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు భూ యజమానులు ముందుకు రావడం లేదని చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

