జూబ్లీహిల్స్,ఏప్రిల్4ః రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లోని ఇందిరానగర్ ఫేస్-2లో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన పునర్విభజనలో బోరబండ సర్కిల్ కార్మిక నగర్ డివిజన్ పరిధిలోకి వస్తున్న ఈ ప్రాంతం లో 6 నెలల క్రితం సివరేజీ లైన్ల కోసం రో డ్లు తవ్వారు. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అధికారులు సివరేజీ లైన్ పనుల కోసం జరిపిన తవ్వకాల్లో ఇండ్లముందు మెట్లు.. ర్యాంప్‌లు కూడా పూర్తిగా ధ్వసం కాగా ఎంతకీ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ఇంట్లోకి వెళ్లాలంటే పడుతూ లేస్తూ ప్రాణాలరచేత పట్టుకుని బతుకులీడుస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మ హిళలు ప్రతిరోజూ ప్రమాదాల బారిన ప డుతున్నారు.
అయితే ఇంతజరుగుతున్నా అధికారులు కానీ.. గుత్తేదారు కానీ స్పం దించకపోవడం గమనార్హం. దీంతో సా యిబాబా ఆలయం ఇరువైపుల రోడ్లు.. ప్రాస్పర్ స్కూల్ వీధి.. ఎల్లమ్మ గుడి రో డ్డులో నివాసం ఉంటున్న వందలాది గృ హాల ప్రజలు నడిచి వెళ్లాలంటేనే నరకయాతన పడుతున్నారు. ఈ పనులను చేపట్టిన గుత్తేదారు పర్వతాలు రోడ్డు ని ర్మాణం కోసం కంకర కుప్పలు పోసి క నిపించకుండా పోయాడని.. నెలలు గడుస్తున్నా మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి గులాం నబీ రసూల్ తెలిపారు. శనివారం ప్రాస్పర్ స్కూల్ రోడ్డుపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పన్నులు కడుతున్న ప్రజలకు సౌ కర్యవంతంగా రోడ్లు వేయాలని స్థానికులు కోరుతున్నారు.
తవ్వేసి వెళ్లిపోయారు..
ఇండ్లముందు రోడ్డు తవ్వి వెళ్లిపోయారు. ఇంటినుంచి బయటకు రావాలంటే కష్టంగా ఉంది. ఇండ్లముందు నడిచివెళ్లాలంటే కూడా అవస్థలు పడుతున్నాం. కొన్ని నెలలుగా పట్టించుకునే వారు లేరు. పిల్లలు పడిపోతున్నారు. వృద్ధులు నడవలేకపోతున్నారు.
– లక్ష్మీబాయి, స్థానికురాలు