మలక్‌పేట, జనవరి 30: తమపై దాడులకు పాల్పడ్డారని పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో మలక్‌పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఈ నెల 26న దిల్సుఖ్నగర్ ద్వారకానగర్‌కు చెందిన సుధ తన కుటుంబ సభ్యులతో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌లోని బాప్టిస్టు చర్చిలో ప్రార్థనల కోసం రాగా, బహద్దూర్గుడా సరూర్‌నగర్‌కు చెందిన జాకబ్ మోడీ అనే వ్యక్తి సైతం వచ్చాడు. అయితే తన ఇద్దరు కుమారులను జాకబ్ తిట్టాడని, ఈ విషయమై అతడిని ప్రశ్నించబోతే తనను కొట్టాడని సుధా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సుధా, ఆమె భర్త, పిల్లలు తనను కొట్టారంటూ.. జాకబ్ మోడీ సైతం ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.