పీఏతో ఫిర్యాదు చేయించి ఇల్లు కూల్చి వేయించి..
బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు. శుక్రవారం బోరబండ, ఎర్రగడ్డకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు యూసుఫ్ గూడ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి సర్దార్ ఆత్మహత్య పై అధికారులను నిలదీశారు.
- బాబా ఫసియోద్దీన్ దురాగతంపై
- స్థానికులకు రికార్డులు చూపిన అధికారులు
- సర్దార్ ఇంటి నిర్మాణం పై
- ఫిర్యాదు చేసింది బాబా పీఏ సప్తగిరే
- ‘పోయిన ప్రాణం తీసుకొస్తారా’అంటూ అధికారులను నిలదీసిన స్థానికులు
వెంగళరావునగర్, మే 30 : బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు. శుక్రవారం బోరబండ, ఎర్రగడ్డకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు యూసుఫ్ గూడ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి సర్దార్ ఆత్మహత్య పై అధికారులను నిలదీశారు. ‘పోయిన ప్రాణం తీసుకొస్తారా’ అని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎవరు ఫిర్యాదు చేశారని గట్టిగా నిలదీయడంతో ఫిర్యాదు ఫైల్ ను తీసి వారికి అధికారులు చూపించారు.
అందులో బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి పేరున్నట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద తెలిపారు. ఇక నుంచి ఇటువంటి చర్యలకు పాల్పడితే పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తామని అధికారులను ప్రజలు హెచ్చరించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాసీం, జూబ్లీహిల్స్ యూత్ ప్రెసిడెంట్ ఖాలిద్, జీటీఎస్ దేవాలయ మాజీ చైర్మన్ బోడ రాంచందర్,జనరల్ సెక్రటరీ మనోజ్ యాదవ్,నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

