అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పలు అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి, అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
- పర్యవేక్షణకు మండలానికో ప్రత్యేక అధికారికి బాధ్యతలు
- పనులను పరిశీలించాలని కలెక్టర్ సూచన
మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 14: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం పలు అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి, అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాలకు ఒక్కో మండలానికి జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు చెప్పారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన మండలంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
అభివృద్ధి పనుల పురోగతిపై మండల స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని, గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నెల కలెక్టరేట్లో అభివృద్ధి పనులపై సమావేశం ఉంటుందని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి, అభిషేక్ అగస్త్య, డీఆర్ఓ లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు, ఈఆర్ఓలు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మోహన్‌రావు, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు నమోదుపై కలెక్టర్ సమీక్ష
ఓటరు నమోదుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమా వేశం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రవికిరణ్ జిల్లా కలెక్టర్లతో ఓటరు నమోదు, సవరణలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనలను అధికారులు పాటించాలని సూచించారు. ఓటరు జాబితాలో సవరణలు జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని, జిల్లాలో టాన్స్‌జెండర్ ఓటరు నమోదు తప్పకుండా చేపట్టాలని సూచించారు. ఆర్ఓలు ప్రత్యేక దృష్టి పెట్టి బూత్ లెవల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, జిల్లాలో ఓటరు నమోదును పక్కాగా జరిగేలా చూడాన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

