మియాపూర్ : సామాజికాంశాలపై ప్రజలలో చైతన్యం నింపుతూ సమిష్టిగా కాలనీ అభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. కాలనీలకు తన సంపూర్ణ తోడ్పాటును అందిస్తానన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ సాయిప్రశాంత్‌నగర్ బీ బ్లాక్ కాలనీకి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఆదివారం విప్‌ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ కాలనీలు, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుకోవటం, పచ్చదనం సహా పలు అంశాలలో ప్రజలను భాగస్వాములు చేస్తూ ముందుకు సాగాలని విప్ గాంధీ పేర్కొన్నారు.
కాలనీలను మౌలిక వసతుల పరంగా అభివృద్ధిలో తీసుకెళ్లే లక్ష్యంతో తాను కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీలో ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ,తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో సలహాదారులు చందు, వెంకటేశ్వర్రావు, రవి, అధ్యక్షులు లక్ష్మీ, భాగవతం, ఢిల్లేశ్వర్రావు, వేదవ్యాసులు,కృష్ణ, రాజు, రాజేందర్, వాసు, నర్సింగరావు, గోవింద్, నాగబాబు, లలిత, శేఖర్ ,నారాయణ, రవీందర్, శేఖర్ ,మన్మధరావు, చిన్నయ్య ,చెంచయ్య ,ధన్‌రాజ్, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.