మల్లాపూర్, ఆగస్టు 26 : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేద,మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆసరగా ఉం టుందని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మల్లాపూర్, మీర్పేట్ డివిజన్లకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు సంధ్యకు రూ.60 వేలు, వెంకటేశ్‌కు రూ.60 వేల మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కటార్ల భాస్కర్, జంపాల్రెడ్డి, నరేశ్, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.
ఫొటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి
కాప్రా, ఆగస్టు 26: ఫొటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం కాప్రా ఫొటోగ్రాఫర్ల ఫోకస్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను సైనిక్‌పురిలోని కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫోకస్ అసోసియేషన్ కాప్రా అధ్యక్షుడు సాయికుమార్, రమణశ్రీ, ఎండీ గౌసుద్దీన్, గుమ్మడి రాజు, యాకయ్య, ఎంపీదాస్, ఆంజనేయులు, భాను, సోమురెడ్డి, ప్రకాశ్, తేజస్వి తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్‌ల కృషి హర్షణీయం ..
చర్లపల్లి, ఆగస్టు 26 : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు లయన్స్ క్లబ్‌ల కృషి హర్షణీయమని ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ శ్రీ శివాంజనేయ దేవస్థానంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఏఎస్‌రావునగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహపురి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నా రు. ఈ కార్యక్రమంలో ఆర్యాస్ మల్టీస్పెషాలిటీ దంత వైద్యశాల డాక్టర్ హేమంత్, ఏఆర్ఎస్ వైద్యశాల వైద్యుడు వీఎస్ఎన్ రాజు, వైద్యులు హరగోపాల్, జ్యోత్స్న, ఉద య్, జాగృతి, కోఆర్డినేటర్స్ శ్రీదేవి, వరప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, చల్లా వెంకటేశ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు శ్రీనివా స్‌రెడ్డి, ఆలయ చైర్మన్ సుబ్బారావు, కాలనీవాసులు పాల్గొన్నారు.