ఎన్నికలు వస్తున్నాయి.. ఆగం కావొద్దు
మెతుకు సీమ గడ్డపై సీఎం కేసీఆర్ ‘ప్రగతి శంఖారావం’ పూరించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో మెదక్ పట్టణం గులాబీమయమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మధన్‌రెడ్డి, క్రాంతికిరణ్, అధికారులతో కలిసి ప్రారంభించారు.
- ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
- అట్టహాసంగా సమీకృతకలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం,బీఆర్ఎస్ భవనం ప్రారంభం
- మెదక్ ‘ప్రగతి శంఖారావం’గ్రాండ్ సక్సెస్
- సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు
- గులాబీమయమైన మెదక్ పట్టణం
- దారిపొడవునా స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు
- జిల్లాకు వరాల జల్లు
మెతుకు సీమ గడ్డపై సీఎం కేసీఆర్ ‘ప్రగతి శంఖారావం’ పూరించారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో మెదక్ పట్టణం గులాబీమయమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మధన్‌రెడ్డి, క్రాంతికిరణ్, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వస్తున్నాయని ఆగం కావొద్దు. ఈ సమయంలోనే మన ధీరత్వం ప్రదర్శించాలి. ఒకనాడు మెదక్ జిల్లా ప్రజలు తాగేందుకు, పంటల కోసం నీరులేక గోసవడ్డరు.
ఇవాళ కాళేశ్వరం జలాలతో వాగులపై చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకుతున్నాయి. ఇవాళ లక్ష్మీ అమ్మవారు ఓలలాడుతున్నట్లుగా అద్భుతమైన పంటలు పండుతున్నాయి. నాడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ సోయి ఉన్నదా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆసాంతం జై తెలంగాణ.. జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు తరలిరావడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కళాకారులతో కలిసి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన పాటలతో అందరినీ ఉత్సాహపరిచారు. సభా వేదికగా ముఖ్యమంత్రి మెదక్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు.





Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

