సిటీ క్రిమినల్ కోర్ట్, నాంపల్లి, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆర్థికంగా ఇబ్బందులు ఉండి న్యాయవాదిని నియమించుకోలేని వారి కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు మెట్రోపాలిటన్ లీగల్ సర్వీస్ అథారిటీ బాధితుల తరపున న్యాయవాధిని నియమించడంతో పాటు వేతనం ఇవ్వనున్నది. ఇందుకోసం 2021-22 సంవత్సరానికి గాను దరఖాస్తులను స్వీకరిస్తున్నది. నాంపల్లి సెషన్ జడ్జి తుకారం ఉత్తర్వుల మేరకు అన్నికేసులపై అవగాహనతో పాటు మూడు సంవత్సరాల అనుభవం ఉన్న న్యాయవాదులు జూన్ 30 నుంచి జూలై 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధు శేఖర్ తెలిపారు.