సుల్తాన్‌బజార్, డిసెంబర్ 22 : నాంపల్లి గృహకల్ప ఆవరణలోని జిల్లా శాఖ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ ట్వింకిల్ జాన్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి హాజరై డాన్‌బాస్కో అనాథ ఆశ్రమానికి చెందిన చిన్నారులచే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డాన్ బాస్కో అనాథ ఆశ్రమం చిన్నారులకు 6 నెలలకు సరిఫడా నిత్యావసర సరుకులతో పాటు దుస్తులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం కోశాధికారి రామినేని శ్రీనివాస్‌రావు, కార్యదర్శి చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, నగర శాఖ అధ్యక్షుడు శ్రీరాం, కార్యదర్శి శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.విక్రమ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర, సంయుక్త కార్యదర్శి నరేశ్ కుమార్, సభ్యులు ఎంఏ ముజీబ్, పీఆర్వో జహంగీర్ అలీ, పీఆర్వో మహ్మద్ వహీద్, తదితరులు పాల్గొన్నారు.