ప్రియుడి ఒత్తిడితోనే చిన్నారి హత్య
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 ఏళ్ల చిన్నారి తన్విక అనుమానాస్పద మృతి కేసులో తల్లి రేఖ,ప్రియుడు బోనగిరి సాయికుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం..ఈ నెల 16న రాత్రి ఓల్డ్ అల్వాల్‌కు చెందిన తన్విక కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
- తల్లి, ప్రియుడు అరెస్ట్
అల్వాల్,మే19ః అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 ఏళ్ల చిన్నారి తన్విక అనుమానాస్పద మృతి కేసులో తల్లి రేఖ,ప్రియుడు బోనగిరి సాయికుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం..ఈ నెల 16న రాత్రి ఓల్డ్ అల్వాల్‌కు చెందిన తన్విక కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.అనంతరం ఇంటి పైభాగంలోని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లో చిన్నారి మృతదేహం లభించింది.దీనిపై కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలుః
బేగంపేట్ ఏసీపీ గోపాల్కృష్ణమూర్తి పర్యవేక్షణలో డీఐ వీరబాబు,ఎస్ఐ దేవేందర్ దర్యాప్తు చేపట్టారు.రేఖకు 2020లో దూరపు బంధువు రాజుతో వివాహం జరిగింది.తన్విక జన్మించాక భార్యాభర్తల మధ్య గొడవలతో 2020 నుంచి విడిగా ఉంటున్నారు.మార్చి 4న తన్విక మొదటి పుట్టిన రోజు సందర్భగా ఇంటి పక్కనే ఉండే సాయికుమార్‌తో రేఖకు పరిచయం ఏర్పాడింది.అది క్రమంగా ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.సాయికుమార్ (20) ఏళ్లు కావడం రేఖకు అప్పటికే పెళ్లి జరిగి కూతురు ఉండటంతో సాయికుమార్ కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు.
దీంతో తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ బయట కలుసుకునేవారు.వారం కిత్రం శ్రీబేకరీ ఎదురుగా కాలనీలో కలుసుకుని పెళ్లికి చిన్నారి అడ్డుగా ఉందని భావించి ఆమెను తొలగించాలని ప్రణాళిక వేశారు.మొదట అల్వాల్ చెరువులో తోసేయాలనుకున్నా రద్దీ ఎక్కువగా ఉండటం, ఇంటికి దూరం కావడంతో ఆలోచన విరమించుకున్నారు.సాయికుమార్ సలహా సలహా మేరకు ఈనెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని ఆడుకుందామని టెర్రస్‌పైకి తీసుకెళ్లి వాటర్ ట్యాంక్‌లో వేసి హత్య చేసింది.తర్వాత కిందకి వచ్చి పాప కనిపించడం లేదని నాటకమాడింది.ప్రియుడు సాయికుమార్ ఒత్తిడితోనే చిన్నారిని చంపినట్లు రేఖ పోలీసుల విచారణలో ఒప్పుకుంది.ఈ కేసును ఛేదించిన సీఐ ప్రశాంత్, డీఐ వీరాబాబు,ఎస్ఐ దేవేందర్‌ను అధికారులు అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

