అంబర్పేట, ఫిబ్రవరి 24: కేర్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాశ్రావు టాప్ మోస్ట్ హెల్త్ కేర్ లీడర్స్ గ్లోబల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్రావు డీడీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ అండ్ వెల్నెస్ కాంగ్రెస్ అండ్ అవార్డ్స్-2025 తొమ్మిదో ఎడిషన్ వారు తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు వివరించారు. కొన్ని దశాబ్దాలుగా దాదాపు పదివేలకు పైగా గుండెకు సంబంధించిన ఆపరేషన్లు విజయవంతంగా చేసినందుకు తనకు ఈ అవార్డు ముంబైలో అందజేసినట్లు తెలిపారు.