హైదరాబాద్, అక్టోబర్ 13: ఇంటి నిర్మాణం కంటే ముందే తమ ఇంటిని టెస్ట్ డ్రైవ్ లాగా ముందుగానే చూసుకునే టెక్నాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో టెక్-ఎనేబుల్డ్ హోమ్ బిల్డర్ బిల్డ్నెక్ట్స్.. ఇలాంటి సేవలు అందించడానికి హైదరాబాద్‌లో తాజాగా ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఈవో గోపి కృష్ణన్ మాట్లాడుతూ.. కస్టమర్‌కు తమ ఇంటి నిర్మాణం కంటే ముందుగానే ఇంటిని చూపించాలనే ఉద్దేశంతో ఈ నూతన సెంటర్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే మూడు నెలల్లో తెలంగాణలో 100 గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. త్వరలో బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌తోపాటు ఉత్తర భారతానికి కూడా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారించిన సంస్థ..త్వరలో వరంగల్‌లో కూడా ఆఫీస్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.