దున్నరాజుల విన్యాసాలు.. వీక్షిద్దాం రండి..
దున్నరాజుల విన్యాసాలు.. వీక్షకుల కేరింతల నడుమ సదర్ ఉత్సవాలు మహానగరంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీపావళి ముగిసిన రెండో రోజున సదర్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హర్యానా, పంజాబ్ నుంచి ప్రత్యేక దున్నపోతులను నగరానికి తీసుకువచ్చారు
- నేడు, రేపు వైభవంగా సదర్ వేడుకలు
- ప్రత్యేక ఆకర్షణగా కోట్లు విలువజేసే దున్నపోతులు
- ఒక్క దున్నరాజుకు రోజుకు 10 వేల విలువజేసే పౌష్టికాహారం
- వాటిని పర్యవేక్షించేందుకు ఇద్దరు వ్యక్తులు
- ఆవాల నూనెతో మర్దన, రాత్రి 9 గంటలకు నిద్రలోకి..!
- మద్యం తాగించడం మంచిదికాదని వైద్యుల సూచన
- ఉత్సవాల్లో పంజాబ్, హర్యానా, హైదరాబాద్‌కు చెందిన దున్నలు
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): దున్నరాజుల విన్యాసాలు.. వీక్షకుల కేరింతల నడుమ సదర్ ఉత్సవాలు మహానగరంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీపావళి ముగిసిన రెండో రోజున సదర్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హర్యానా, పంజాబ్ నుంచి ప్రత్యేక దున్నపోతులను నగరానికి తీసుకువచ్చారు. ఈ సారి ఉత్సవాల్లో శ్రీకృష్ణ, గరుడ, కింగ్, సర్తాజ్, ధారా, సుల్తాన్ లవ్ రాణా, షారుఖ్, కమాండో, బహుబలి, బల్రామ్, వీర మొదలగు దున్నలు సందడి చేయనున్నాయి. 26, 27న నగరంలోని ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, కాచిగూడ, బోయిన్పల్లి, మారేడుపల్లి, చప్పల్‌బజార్, మధురానగర్, కార్వాన్, పాతబస్తీలోని ప్రాంతాల్లో ఉత్సవాలు జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఆహారం ఇలా..!!
- అన్ని దున్నరాజుల ఆహారశైలి ఒకే విధంగా ఉంటుంది. ఆహారంలో తేడా ఉండదు.
- తెల్లవారు జామున 4:30గంటలకు నిద్రలేస్తాయి. రోజులో సాధారణంగా ఒక్క దున్నరాజుకు ఇచ్చే పోషకాహారం విలువ 4-6 వేలు. సదర్ ఉత్సవాల సందర్భంలో రోజుకు పది వేల వరకు ఖర్చు ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
- ఉదయం కాజు, పిస్తా, బాదం, కజ్జూర్, బెల్లం, పాలు, యాపిల్, అరటిపండ్లు, పప్పులు మిశ్రమాన్ని తినేంత వరకు అందిస్తారు. వీటిని చూసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. 24 గంటలు విధుల వారీగా పర్యవేక్షిస్తారు.
- మధ్యాహ్నం సొప్పగడ్డి, మొక్కజొన్న బెండ్లు, కల్లిపిండి, శనగపొట్టు, గోధుమపొట్టు తదితర పౌష్టిక ఆహారాన్ని అందిస్తారు.
- సాయంత్రం 3కిలోమీటర్లు వాకింగ్ తీసుకువెళ్తారు. అనంతరం సరిఫడా నీళ్లు తాగిస్తారు. స్నానం చేయించి ఆవాల నూనెతో మర్దన చేస్తారు. రాత్రి ఆహారం ఇవ్వరు. రాత్రి 9 గంటల వరకు నిద్రలోకి జారుకుంటుంది.
శిక్షణకు ఏడాది సమయం.!!
దున్నరాజులకు ఇచ్చే విన్యాసాల ట్రెయినింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఏ విన్యాసం నేర్పించాలనుకున్నా దానిని నేర్చుకోవడానికి ఒక్క దున్నరాజుకు కనీసం ఏడాది సమయం పడుతుంది. ముఖ్యంగా బైటెక్, ఉడ్ విన్యాసాలు సదర్‌లో ప్రత్యేకంగా ఉంటాయి. రెండు కాళ్లు హోల్డ్ చేసి నమస్కరించే విధానాన్ని బైటెక్గా పిలుస్తారు. వెనక రెండు కాళ్లపై నిల్చొని ముందు రెండు కాళ్ల పైకిలేపడాన్ని ఉడ్గా పిలుస్తారు.
దున్నల వీర్యానికి డిమాండ్..
వీటి వీర్యం వల్ల కలిగే సంతానం అత్యంత బలిష్టంగా ఉంటాయి. రోజుకు 15 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తాయి. అందుకే వీటి వీర్యానికి చాలా ధర ఉంటుంది. చిన్న చిన్న ట్యూబ్లలో నిల్వచేసిన వీర్యాన్ని రూ.300 నుంచి 600 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారని నిర్వాహకులు తెలిపారు.
మద్యం తాగించవద్దు.!
సాధారణంగా కొంతమంది మద్యం తాగించడం అలవాటు చేస్తుంటారు. అది సరైన విధానం కాదని నిపుణులు తెలిపారు. మద్యం తాగించడం వలన అవి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. వాటి ప్రవర్తన విచ్చలవిడిగా ఉంటుంది. కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది. విన్యాసాల ప్రదర్శనలోనూ తప్పిదాలు దొర్లుతాయి. కేవలం పబ్లిసిటీ కోసం మద్యం తాగించడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యానికి గురైతే.. పశు వైద్యులు పరిశీలించి కావాల్సిన మందులు, ఇంజెక్షన్స్ అందిస్తుంటారు.
డీజేలు ఏర్పాటు చేయవద్దు: సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): సదర్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర సూచించారు. మంగళశారం సీసీఎస్ కన్ఫరెన్స్ హాల్లో సదర్ వేడుకల ఏర్పాట్ల నిర్వహణపై పోలీసులు, వెటర్నరీ శాఖ అధికారులు యాదవ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీజేలు ఏర్పాటు చేయవద్దని, 108 అత్యవసర వాహనాలను అందుబాటులో ఉంచాలని, మొబైల్ టాయిలెట్స్, పశు వైద్యులు అందుబాటులో ఉండాలని, వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సూచించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు, ఆయా పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, వెటర్నరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చక్రపాణి రెడ్డి, సంఘం నాయకులు నందకిశోర్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
యాదవుల ఆత్మీయ సమ్మేళనం
బలిష్టమైన దున్నపోతులు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. దున్నరాజుల సవ్వడిని చూసేందుకు లక్షలాదిగా అభిమానులు ఆసక్తి చూపుతారు. అందుకే సదర్ ఉత్సవాలు ప్రతి ఏడాది అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా సదర్ సంబురాలు ఆకాశన్నంటేల సర్కార్ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ప్రతీ దీపావళి అనంతరం సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.
– హరిబాబు, సదర్ నిర్వాహకుడు.
దున్నరాజుల ప్రత్యేకతలు
గరుడ

రూ.35 కోట్ల విలువైన గరుడ దున్న. దీని బరువు 1854 కిలోలు, పొడవు ఏడు అడుగులు. వయసు మూడేండ్లు. దీనికి ఉదయం 5 లీటర్ల పాలు, సాయంత్రం 40 కోడిగుడ్లు, సాధారణ రోజు 7వేలు, సదర్‌లో 10వేలు ఖర్చు అవుతుంది.
సర్తాజ్

ఇది హైదరాబాద్ దున్నరాజు. దీని యజమాని అఖిల భారత యాదవ మహాసభ స్టేట్ జనరల్సెక్రటరీ ఎడ్ల హరిబాబుయాదవ్. హర్యానా నుంచి కొనుగోలు చేశారు. దీని బరువు1500 కేజీలు. 7 ఫీట్ల పొడవు, 15 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఇప్పటి వరకు 25 సార్లు అనేక చాంపియన్ పోటీల్లో విజేతగా నిలిచింది. దీని విలువ రూ.16 కోట్లపైమాటే. వయస్సు ఏడేళ్లు.
కింగ్

ఇది పంజాబ్‌కు చెందినది. 1600 కేజీల బరువు, ఆరున్నర అడుగుల ఎత్తు, 7.2 ఫీట్ల పొడవు, 15 ఫీట్ల వెడల్పు. చూడటానికి గాంభీరంగా దర్శనమిస్తుంది. సదరు విన్యాసాలను ప్రదర్శించడంలో దిట్ట. ఇది హైదరాబాద్‌కు చెందినది. దీని వయస్సు నాలుగున్నర ఏండ్లు.
భీమ్

ఇది హర్యానాకు చెందినది. సెప్టెంబర్ 31న నగరానికి వచ్చింది. 1600 కేజీల బరువు, 7.5 ఫీట్ల పొడవు, 15.6 ఫీట్ల వెడల్పు ఉంటుంది.
ధారా

దీని బరువు 1400కేజీలు, పొడవు 6.5 ఫీట్లు, వెడల్పు 14.5 ఫీట్లు ఉంటుంది.
అర్జున్

దీని వయస్సు నాలుగేండ్లు. హర్యానా నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనుగోలు చేసి
తీసుకువచ్చారు. దున్న పొడవు 6 ఫీట్లు, వెడల్పు 14 ఫీట్లు, బరువు 1500కేజీలు ఉంటుంది.
శ్రీకృష్ణ

ఇది హర్యానాకు చెందినది. దీని వయస్సు 5 ఏండ్లు. బరువు 1800 కిలోలు, 7 అడుగుల ఎత్తు, 18 అడుగుల పొడవు. అత్యంత బలీష్టమైనది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

