Hyderabad | హైదరాబాద్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం.. కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరిన కేటీఆర్
Hyderabad | హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఎల్లమ్మబండ మెయిన్ రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మహవీర్ కాలనీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంగళవారం ఉదయం అల్విన్ కాలనీ చౌరస్తాకు వచ్చాడు.
Hyderabad | హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఎల్లమ్మబండ మెయిన్ రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మహవీర్ కాలనీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంగళవారం ఉదయం అల్విన్ కాలనీ చౌరస్తాకు వచ్చాడు. అక్కడే ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కింద పడేశాడు. అనంతరం ఓ రాయితో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు గోవింద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనను స్థానికులు వీడియో తీయగా కాసేపటికే అది వైరల్‌గా మారింది.
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎంతగానే గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
Demand @TelanganaDGP to take stern action on the perpetrator of this heinous act
Strongly condemn the atrocious act of destruction of the statue of Prof. Jayashankar Garu who is widely regarded and respected in Telangana https://t.co/mvkuBHOyxj
— KTR (@KTRBRS) January 16, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

