MLA Padma Rao Goud | అభివృద్ధి పథంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం : ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
MLA Padma Rao Goud | సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్ర స్థానంలో నిలుపుతామని, నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
MLA Padma Rao Goud | సికింద్రాబాద్, జులై 2 : సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్ర స్థానంలో నిలుపుతామని, నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో బుధవారం సుమారు రూ.75 లక్షల విలువజేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. చిలకలగూడలోని వెంకటేశ్వర నగర్లో రూ.25 లక్షలు, మార్కండేయ నగర్లో రూ.28 లక్షలతో రోడ్డు నిర్మాణం పనులు, సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో రూ.14 లక్షల ఖర్చుతో మరమ్మత్తు పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్బంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అధికారులు నిర్లక్షంగా వ్యవహరించరాదని సూచించారు. అధికార యంత్రాంగం వర్షా కాలంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక కార్పొరేటర్లతో సమన్వయం చేసుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. కార్పొరేటర్ హేమ మాట్లాడుతూ… సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులను చురుకుగా చేపడుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, అధికారులు స్వర్ణలత, కౌశిక్‌లతో పాటు వివిధ విభాగాల అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

