గ్రేటర్ గులాబీ మయం సంబురంగా దీక్షా దివస్
చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన రోజు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందడుగు పడిన రోజు.. తరాలు మారినా, యుగాలు మారినా చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు.. బీఆర్ఎస్ అధినేత, దగాపడిన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించిన ప్రజా బాంధవుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిన నవంబర్ 29 దీక్షా దివస్ను బీఆర్ఎస్ శ్రేణులు, గ్రేటర్ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
- కేసీఆర్ దీక్ష.. నెరవేరిన రాష్ట్ర ఆకాంక్ష
- గ్రేటర్ వ్యాప్తంగా ఘనంగా దీక్షా దివస్
- పాల్గొన్న నగర ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు
- గులాబీ జెండాలతో హోరెత్తిన నగరం
- కేసీఆర్ కటౌట్లకు నేతల క్షీరాభిషేకాలు
- ఉద్యమ కాలం నాటి వీడియోలు ప్రదర్శన
సిటీ బ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన రోజు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందడుగు పడిన రోజు.. తరాలు మారినా, యుగాలు మారినా చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు.. బీఆర్ఎస్ అధినేత, దగాపడిన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించిన ప్రజా బాంధవుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టిన నవంబర్ 29 దీక్షా దివస్ను బీఆర్ఎస్ శ్రేణులు, గ్రేటర్ ప్రజలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి గులాబీ రంగు పులుముకున్నట్లు ఎక్కడ చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన అసమాన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించేందుకు దీక్షా దివస్ను చేపట్టారు.

నగరంలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వివిధ రూపాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ నిలువెత్తు కటౌట్లకు క్షీరాభిషేకాలు చేశారు. నాడు కేసీఆర్ సహా విద్యార్థులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. చావు నోట్లో తలపెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి కేసీఆర్ ఢిల్లీ పెద్దల మెడలు వంచిన తీరును, నాటి ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్నారు.

నగరమంతా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలను చేపట్టారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. ఉద్యమ కాలం నాటి వీడియోలు, ఫొటోలను ప్రదర్శించి నాటి జ్ఞాపకాలను బీఆర్ఎస్ శ్రేణులకు చూపించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

