e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home హైదరాబాద్‌ వేగంగా వైద్య సేవలకు బైక్‌ అంబులెన్స్‌

వేగంగా వైద్య సేవలకు బైక్‌ అంబులెన్స్‌

ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి వైద్య సేవలు అందించడంలో ప్రతీ క్షణం విలువైనదే. అత్యవసర సమయంలో అపర సంజీవనిగా అంబులెన్స్‌లు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అయితే నగరంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినపుడు, అంబులెన్స్‌ వాహనం పట్టని గల్లీలు ఉన్నప్పుడు వైద్య సేవలు అందించడం ఆలస్యం కావడమే కాదు.. కష్టతరం కూడా. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం బైక్‌ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రమాద సమయంలో ‘ఫస్ట్‌ రెస్పాండర్‌’ వేగంగా వెళ్లి సకాలంలో సరైన ప్రథమ చికిత్స అందించడంలో ఈ బైక్‌ అంబులెన్స్‌లు ఉత్తమంగా పని చేస్తున్నాయి.

సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతంలో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108 బైక్‌ అంబులెన్స్‌ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్‌ సర్కిల్‌తో పాటు కంటోన్మెంట్‌ బోర్డు పరిసర ప్రాంతాల్లో సుమారు 700 కాలనీలు, 200లకుపైగా బస్తీలు ఉండటంతో ప్యారడైజ్‌ కేంద్రంగా 108 బైక్‌ అంబులెన్స్‌ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ అంబులెన్స్‌పై సీనియర్‌ టెక్నీషియన్‌ రాజన్న అందుబాటులో ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లోని బస్తీలు, ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగినపుడు ఫోర్‌ వీలర్‌ అంబులెన్స్‌ చేరుకోలేని పరిస్థితుల్లో ‘ఫస్ట్‌ రెస్పాండర్‌’ చేరుకుంటుంది. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు బైక్‌ అంబులెన్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.

సత్వర సేవలు…

- Advertisement -

కరోనాతో పాటు వైరల్‌ జ్వరాల కారణంగా దవాఖానలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నవారికి ఫస్ట్‌ రెస్పాండర్‌ టెక్నీషియన్‌ ఇంటికి వచ్చి స్లైన్‌ ఎక్కించటం, చిన్నపిల్లలకు నెబ్యులైజర్‌ పెట్టడం ఉచితంగా చేస్తారు. అవసరమైతే ఆక్సిజన్‌ సిలిండర్‌ను అమర్చి ఉపశమనం కల్పిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇండ్లల్లో కిట్లు అందుబాటులో ఉంటే పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలిస్తారు. అవసరమైన వారికి ఇంజక్షన్లు కూడా చేస్తారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, గుండెపోటు, పాముకాటు, ప్రసవాలు, బీపీ, షుగర్‌, విషం తాగిన కేసుల్లో సత్వరమే వైద్య సేవలు అందిస్తున్నారు.

అంబులెన్స్‌లో మెడికల్‌ కిట్‌..

బైక్‌ అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌, బీపీ, షుగర్‌ టెస్టింగ్‌ మీటర్లు, పల్స్‌ మీటర్‌, కృత్రిమ శ్వాస అందించే అంబు బ్యాగ్‌, విషం తాగిన వారికి క్లియర్‌ చేసేందుకు సక్షన్‌ ఆపరేటర్‌, స్లైన్‌బాటిల్స్‌, కాటన్‌, ఆయింట్‌మెంట్స్‌, ట్యాబెట్లు, మాస్కులు, గ్లౌజులతో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ అందుబాటులో ఉంటుంది.

వేగంగా ప్రథమ చికిత్స

ఫోర్‌ వీలర్‌ 108 అంబులెన్స్‌లో ఉన్న వైద్య సదుపాయాలన్నీ బైక్‌ అంబులెన్స్‌లో ఉన్నాయి. ట్రాఫిక్‌ రద్దీ, అంబులెన్స్‌ వెళ్లలేని ప్రదేశాలకు బైక్‌ అంబులెన్స్‌ ద్వారా చేరుకుని బాధితులకు వేగంగా ప్రథమ చికిత్స అందిస్తాం. ఆ తర్వాత 108 ఫోర్‌ వీలర్‌ అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తున్నాం. మూడేండ్ల కాలంలో సికింద్రాబాద్‌ పరిధిలో 108 బైక్‌ అంబులెన్స్‌ ద్వారా సుమారు 1200లకు పైగా కేసుల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలందించాం.- జి. రాజన్న, టెక్నీషియన్‌, 108 అంబులెన్స్‌ బైక్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement