ఆహా కాదు.. అంతకు మించి..
విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం అభివృద్ధిలోనే కాదు.. అంతస్తుల్లోనూ ఆహా అనిపిస్తున్నది. కండ్లు చెదిరేలా రూపుదిద్దుకుంటున్న ఆకాశహర్మ్యాలు 400 ఏండ్ల చారిత్రక నగర అందాలకు మరింత వన్నెలద్దుతున్నాయి.
- ఆకాశహర్మ్యాల్లో ఆధునికత
- మేటి ఆర్కిటెక్చర్లతో డిజైన్ల రూపకల్పన
- మహానగరంలో కొలువుదీరుతున్న ఆధునిక భవంతులు
- విభిన్న డిజైన్ల రూపకల్పనలో పోటాపోటీ
విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరం అభివృద్ధిలోనే కాదు.. అంతస్తుల్లోనూ ఆహా అనిపిస్తున్నది.
కండ్లు చెదిరేలా రూపుదిద్దుకుంటున్న ఆకాశహర్మ్యాలు 400 ఏండ్ల చారిత్రక నగర అందాలకు మరింత వన్నెలద్దుతున్నాయి. పలు నిర్మాణ సంస్థలు ఎత్తయిన భవనాలను నిర్మించేందుకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాయో.. వాటి డిజైన్లపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. దేశ, విదేశ ఆర్కిటెక్చర్లతో అత్యుత్తమ డిజైన్ల రూపకల్పన చేయిస్తున్నాయి. ఫలితంగా నగరంలో అత్యాధునిక భారీ భవంతులు కొలువుదీరుతున్నాయి. ఐటీ కారిడార్‌తో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ఈ ఆధునిక శైలి కనిపిస్తుంటే.. గేటెడ్ కమ్యూనిటీల్లోని డూప్లెక్సులు, ట్రిప్లెక్స్ విల్లాలు సైతం ఈ విధానాన్నే మేళవించుకుంటున్నాయి. కేవలం భవనాలకు ఎలివేషన్ మాత్రమే కాదు..లోపల కూడా అదిరిపోయే లుక్లతో ప్రముఖ ఆర్కిటెక్చర్లు ఆధునిక డిజైన్లు రూపొందించి బిల్డర్లకు ఇస్తున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : అంతస్తుల్లోనే కాదు…ఆర్కిటెక్చర్‌లోనూ ఆహా ఆనిపించేలా హైదరాబాద్ మహానగరంలో ఆకాశహర్మ్యాలు కొలువుదీరుతున్నాయి. కొత్తదనమే కాదు… కండ్లు చెదిరే డిజైన్లు ఆవిష్కృతమయ్యేలా బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. 400 ఏండ్ల చారిత్రాక నేపథ్యం ఉన్న నగరం సరికొత్తగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలతో నిండుగా కనిపిస్తోంది. భవన నిర్మాణాలపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ‘హైదరాబాద్ నగరం అంటే ప్రత్యేకంగా ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బిల్డర్లు భవనాలను నిర్మించాలి. బిల్డింగ్ నిర్మాణం అంటే డబ్బాల మాదిరి కట్టేసి వెళ్లిపోకూడదు. సరికొత్త డిజైన్లతో చూపరులను ఆకట్టుకునేలా ఉండేలా భవనాలను నిర్మించాలి’ అని సూచించారు. దానికి అనుగుణంగానే నగరంలోని ఐటీ కారిడార్‌తో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో భవన నిర్మాణాల్లో అత్యాధునిక శైలిని అవలంభిస్తున్నారు. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీల్లోని డూప్లెక్సులు, ట్రిప్లెక్స్ విల్లాలు సైతం ఆధునికతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఓ నిర్మాణ సంస్థ అత్యాధునిక డిజైన్లతో 16 అంతస్తులతో 60 మీటర్ల ఎత్తుతో కూడిన వ్యాపార భవనాన్ని నిర్మిస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో నిర్మిస్తున్న భవనాల డిజైన్లు ఆధునికతను మేళివించుకొని ఉంటున్నాయి. కేవలం భవనాలకు ఎలివేషన్ మాత్రమే కాదు, లోపల సైతం అంతకు మించి అన్నట్లుగా ప్రముఖ ఆర్కిటెక్టులు డిజైన్లు రూపొందించి బిల్డర్లకు ఇస్తున్నారు.
దేశ, విదేశాల ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు…
నగరంలోని బిల్డర్లు ఎత్తయిన భవనాలను నిర్మించడానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో… అదే విధంగా వాటి డిజైన్ల రూపకల్పనకు అంతే ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకు నిదర్శనం జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ నికెన్ సెక్కీ మొట్ట మొదటి సారిగా నగరంలో ఓ భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి డిజైన్ చేసింది. ఇలా ఒక్క సంస్థనే కాదు… నగరం కేంద్రంగా ఉన్న బిల్డర్లు పోటా పోటీగా భవన నిర్మాణ డిజైన్లను ఆకట్టుకునే తీర్చిదిద్దడంలో పోటీ పడుతున్నారు. దాని ఫలితమే ఆకాశహార్మాల్లో ఆధునికత కనిపిస్తోంది.
కొత్తదనంతో విభిన్న డిజైన్లు..
భవన నిర్మాణాల్లో కొత్తదనం కోసం ఆర్కిటెక్ట్స్ విభిన్న డిజైన్లను రూపొందిస్తున్నారు. బిల్డర్ల అభిరుచులు, బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకుంటూ ప్రపంచంలోనే అత్యుత్తమం అనేలా విల్లాల నిర్మాణం, భారీ బహుళ అంతస్తుల భవనాలకు డిజైన్లను అందిస్తున్నారు. పర్యావరణ హితంగా ఉండేలా, దేశ, విదేశాల్లోనూ మరెక్కడా లేని విధంగా సృజనాత్మకతతో నగరానికి చెందిన ఆర్కిటెక్టులు డిజైన్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో పలు చోట్ల నిర్మించిన భారీ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో విల్లాలో విభిన్న డిజైన్లతో కూడిన నిర్మాణాలు కనిపిస్తాయి.
– నిరూప్ రెడ్డి, అర్కిటెక్ట్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

