Muta Gopal | సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
Muta Gopal | సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ సూచించారు. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వ్యాధులతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అన్నారు.
Muta Gopal | కవాడిగూడ, జూన్ 14: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ సూచించారు. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఎస్ఆర్డీ), జనహిత ఫౌండేషన్, కిమ్స్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భోలక్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం ముఠా గోపాల్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వ్యాధులతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అన్నారు. అనారోగ్య సమస్యలు ఎదురైన వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ వైద్య సంస్థలు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు అందించే వైద్య సేవలను మురికివాడల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ వైద్య శిబిరంలో దాదాపు 200 మందికి బీపీ, షుగర్, గైనిక్, ఆర్థోపెడిక్, కంటిపరీక్షలు, న్యూరో తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవసరమైనవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

