ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 31: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఏఎస్ఎల్పీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.
బీఎఫ్ఏ ఫొటోగ్రఫీ, ఐప్లెడ్ ఆర్ట్స్, పెయింటింగ్ కోర్సుల మొదటి, రెండు, మూడు, అయిదు, ఏడు, తొమ్మిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్స్ డిగ్రీ ఇన్ పోలీస్ మేనేజ్మెంట్ (ఎండీపీఎం) పరీక్షా ఫీజు ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) ఫలితాల చాలెంజ్ వాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ.10వేలు చొప్పున చెల్లించి, వచ్చే నెల 1వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించి ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.