Ujjaini | చార్మినార్, జూలై 10 : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల నేపథ్యంలో భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సప్త మాతృకలకు సప్త బంగారు బోనం కార్యక్రమం వరుసగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారితో పాటుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి, మూడో బోనం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, నాలుగవ బోనం జూబ్లీహిల్స్ పెద్దమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అందులో భాగంగా 5వ బోనం గురువారం అక్కన్న మాదన్న దేవాలయంలో భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయంగా ముస్తాబు చేసిన బంగారు బోనాన్ని జోగిని నిషా క్రాంతి తలపై ధరించగా వాయిద్యాల నడుమ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మ వారి దేవాలయానికి బయల్దేరింది. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ ప్రతినిధులు గురునాథ్ రెడ్డి, శ్రీకాంత్, వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు డి ప్రభాకర్, మారుతి యాదవ్, సదానంద్ యాదవ్, మధు యాదవ్, ఆదార్ల మహేష్, రామ్ దేవ్ అగర్వాల్, జాగ్ మోహన్, కృష్ణ చేతన్ సూరి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.