వైభవంగా ఎల్లమ్మ తల్లి కల్యాణం
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్యశాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం సతీమణి గీతారెడ్డి సహా, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కలెక్టర్ ప్రియాంక అలతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖులకు దేవాదాయ శాఖ ఆర్జేసీ రామక్రిష్ణారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అమీర్‌పేట్, జూలై 21 : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్యశాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం సతీమణి గీతారెడ్డి సహా, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కలెక్టర్ ప్రియాంక అలతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖులకు దేవాదాయ శాఖ ఆర్జేసీ రామక్రిష్ణారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్ర్తాలు సమర్పించారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం సతీమణి గీతారెడ్డి సహా, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కలెక్టర్ ప్రియాంక అలతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖులకు దేవాదాయ శాఖ ఆర్జేసీ రామక్రిష్ణారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఉదయం 11.51 నిమిషాలకు అమ్మవారి కల్యాణం వైభవంగా జరిగింది.
ఉదయం 3 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలోకి చేరుకున్నారు. క్యూ లైన్లలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా సిబ్బంది ఎక్కడికక్కడ మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. భక్తుల ఆకలి తీర్చడంలో బల్కంపేట వాసులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే అల్పాహార శిబిరాలు, మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్నప్రసాద వితరణ శిబిరాలు కొనసాగాయి. ప్రతియేటా అమ్మవారి కల్యాణం ముగిసిన తరువాత భక్తుల దర్శనార్థం ఉత్సవ విగ్రహాలను కొద్ది గంటల పాటు వేదికపై ఉంచేవారు. ఆ విధంగా కల్యాణోత్సవంలో వీవీఐపీ తాకిడి తగ్గిన తరువాత సామాన్య భక్తులు వేదికపై ఉన్న ఉత్సవ విగ్రహాకు దంణ్ణం పెట్టుకునే వారు. అయితే ఈ సంవత్సరం కల్యాణ ఘట్టం ముగిసిన రెండు గంటల్లోనే ఉత్సవ విగ్రహాలను అర్చకులు తొలగించడంతో భక్తులు నిరాశకు గురయ్యారు.

నేడు రథోత్సవం..
అమ్మవారి కల్యాణోత్సవంలో చివరి ఘట్టంగా రథోత్సవం బుధవారం సాయంత్రం నిర్వహిస్తారు. అమ్మవారిని అందంగా అలంకరించిన రథంపై ఉంచి పుర వీధుల గుండా ఊరేగిస్తారు. సాయంత్రం 6 గంటలకు దేవాలయ ఆవరణ నుంచి మొదలై ఎస్ఆర్నగర్ పాత పీఎస్ మార్గం, అక్కడి నుంచి కమ్యూనిటీ హాల్ మీదుగా కుడివైపు నుంచి వేంకేశ్వరస్వామి వీధి మీదుగా భారతి నర్సింగ్ హోం వరకు వెళ్లి అక్కడి నుంచి దేవాలయానికి చేరుతుందని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

