Property Tax | పనులన్నీ వదిలి.. పన్నులపైనే దృష్టి
Property Tax | ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్‌గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది.
Property Tax | సిటీబ్యూరో: ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్‌గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది. 19.25 లక్షల మందిలో 13.60 లక్షల మంది మాత్రమే ఆస్తిపన్ను చెల్లించగా, వీరి నుంచి రూ. 1720 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టుకున్నది. ఆస్తిపన్ను చెల్లించకుండా ఉన్న దాదాపు 5 .75లక్షల మందిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి రూ.280 కోట్ల రాబట్టాలని భావిస్తున్నారు.
ఈ మేరకు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, డీసీలను సెలవులు రద్దు చేసిన కమిషనర్.. వసూళ్లు పెంచడమే లక్ష్యంగా రోజూవారీ సమీక్షలు పెట్టి టార్గెట్లు ఇస్తున్నారు. ఇతర పనులకు ఫుల్స్టాప్ పెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు ఒక్క ఆస్తిపన్ను కలెక్షన్లపైనే ప్రధాన ఫోకస్‌గా పనిచేస్తున్నారు.జీహెచ్ఎంసీ కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ పథకానికి సద్వినియోగం చేసుకోవాలని, వడ్డీపై 90శాతం పన్ను రాయితీ పొందాలని కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ఆస్తిపన్నును ఆన్లైన్, సిటీజన్ సర్వీస్ సెంటర్లు, ఈ -సేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని, సర్కిల్, హెడ్ ఆఫీస్‌లో ఉన్న సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాయని కమిషనర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

