సిటీబ్యూరో, ఏప్రిల్ 19( నమస్తే తెలంగాణ): సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్సీ నెంబర్ బిడ్డింగ్‌లో పాల్గొని.. 0001 నంబర్‌ను రూ.7.75లక్షలకు దక్కించుకున్నారు. ఇటీవల కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు కోసం ఈ నెంబర్‌ను ఆయన దక్కించుకున్నారు.
కాగా, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఫ్యాన్సీ నెంబర్ల బిడ్డింగ్‌లో రూ.37.15లక్షల ఆదాయం సమకూరిందని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీ రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీ09ఎఫ్0009 నెంబర్‌ను రూ.6.70లక్షలకు కమలయ్య హిస్ కంపెనీ దక్కించుకోగా, టీజీ09ఈ9999 నెంబర్‌ను రూ.99,999కు ఎకో డిజైన్ స్టూడియో కైవసం చేసుకుంది. 0005 నెంబర్ రూ.1.37లక్షలు ధర పలకగా, 0005 నెంబర్ రూ.1.49లక్షలు, 0099 నెంబర్ రూ.4.75లక్షల ధర పలికిందని ఆర్టీఏ అధికారులు తెలిపారు.