గోల్నాక: అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున కల్తీ పెరుగును అధికారులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…అంబర్పేట ప్రధాన రహదారిలోని ఎన్ఆర్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో నరేశ్, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు ఆరు నెలలుగా కల్తీ పెరుగును తయారు చేస్తూ హోటళ్లు, ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నారు.
సమాచారం అందుకున్న అంబర్పేట పోలీసులు, ఖైరతాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ప్రమాదకర రసాయనాలతో పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 2500 కిలోల కల్తీ పెరుగుతో పాటు వివిధ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నరేశ్, రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్నారు అండగా ఉంటాం.