ఖైరతాబాద్, అక్టోబర్ 11: ఆ నలుగురు ఫుల్‌గా మద్యం సేవించారు. చిందులు తొక్కారు…పక్కనే ఉన్న వారిపై దౌర్జన్యం చేశారు…చివరికి పలువురిపై మద్యం బాటిళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. తర్వాత అక్కడికి నుంచి మెల్లగా జారుకున్నారు. గత వారం రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న ఆ నిందితులు.. ఎట్టకేలకు పోలీసులు చిక్కారు. పంజాగుట్ట ఎస్సై పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం… నగరానికి చెందిన జకీర్, రాజు వారి స్నేహితురాలతో కలిసి బేగంపేటలోని లైఫ్‌ైస్టెల్ భవనంలో ఉన్న క్లబ్ 8 రెస్టారెంట్ అండ్ బార్‌కు వచ్చారు. పక్క సీటులో కూర్చున్న నలుగురు వ్యక్తులు ఫుల్‌గా మద్యం సేవించి వెకిలి చేష్ట చేస్తూ వారి స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. దీనిని జకీర్, రాజులు నిలదీయగా, వారిపై మద్యం బాటిళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
అదే క్రమంలో నిందితులు విసిరిన బీర్ బాటిల్ టేబుల్‌పై పగిలి.. గాజు పెంకులు పక్క సీటులో కూర్చున్న విన్స్స్టెన్ అనే వ్యక్తి కంటికి గుచ్చుకోవడంతో కన్నును కోల్పోయాడు. దాడికి గురైన బాధితులతో పాటు కన్ను కోల్పోయిన బాధితుడి సోదరుడు జాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఆ నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారిలో యూసుఫ్‌గూడకు చెందిన సయ్యద్ కలీం (28), రహమత్‌నగర్‌కు చెందిన ఎండీ రషీద్ (23), యూసుఫ్‌గూడకు చెందిన మహ్మద్ ఫిర్దోస్ (23), అదే ప్రాంతానికి చెందిన సిలివేరు అమ్రేశ్ అలియాస్ అమ్రేశ్ పాటిల్ (31) ఉన్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపించినట్లు పోలీసులు తెలిపారు.