మాదాపూర్, జూన్ 11: మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ గాలా ప్లీ మార్కెట్ అట్టహాసంగా సాగింది. డెమోక్రటిక్ సంఘ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి నగర వాసులకు ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. అలాగే సేంద్రీయ జీవనశైలి, సామాజిక పరివర్తనను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తూ మహిళలకు యోగాపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు.
ఇందులో భాగంగా పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించి నగర వాసులకు ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. గ్రీనరీని ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆర్గానిక్ ఉత్పత్తులు, ఫ్యాషన్ దుస్తులతో పాటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం, కారును ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రేణుకా చౌదరి పాల్గొన్నారు.