సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోని జీఎంఆర్ ఎయిర్‌స్పేస్ పార్కులో ఏర్పాటు చేసిన స్కూల్ ఆఫ్ ఏవియేషన్ కేంద్రంలో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును 2024-25 విద్యా సంవత్సరానికి గాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీఎంఆర్ ఎయిరో టెక్నిక్ ప్రెసిడెంట్ అండ్ అకౌంటబిలిటీ మేనేజర్ అశోక్ గోపీనాథ్ తెలిపారు.
ఆసక్తి కలిగిన విద్యార్థులు 10+2 పాస్ అవ్వాలని, 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీతోపాటు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు కలిగి ఉండాలన్నారు.