BC Gurukul junior college | మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి జూనియర్ కాలేజి ఇంటర్మీడియట్ కోర్సులో చేరడానికి ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించామని ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. విద్యార్థుల, తల్లిదండ్రుల వినతి మేరకు దరఖాస్తు గడువు తేదీని పొడిగించామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అధికారిక వెబ్సైట్ https://mjptbcwreis.telangana.gov.in (లేదా) https://mjptbcadmissions.org/MJP-Interకు లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కోర్సులకు, కాలేజీలకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలన్నారు.
అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అని, మరిన్ని వివరాలకు 040-23328266 లో సంప్రదించాలని ఆయన సూచించారు.
బండి భగీరథ్‌పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు : అడ్వకేట్ లలితా రెడ్డి
KTR | విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం.. నీట్ రద్దుపై కేటీఆర్