మియాపూర్: మియాపూర్ ప్రశాంత్‌నగర్‌లోని సర్వే నం. 100, 101లో హెచ్ఎండీఏకు చెందిన భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వారి అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. గడిచిన రెండు రోజులుగా 31 మందిని అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం మరో 21 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 52 మందిని అరెస్టు చేసినట్లు మియాపూర్ సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపారు.