హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ త్సవాల్లోభాగంగా ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 8 నుంచి9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. మార్చి 10న సాయంత్రం 4 నుంచి6 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి…
మార్చి1న ధ్వజారోహణం(మేష లగ్నం) పెద్దశేష వాహనం
మార్చి2న చిన్నశేష వాహనం హంస వాహనం
మార్చి3న సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
మార్చి4న కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
మార్చి5న పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
మార్చి6న హనుమంత వాహనం గజ వాహనం
మార్చి7న సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
మార్చి8న రథోత్సవం అశ్వవాహనం
మార్చి9న చక్రస్నానం ధ్వజావరోహణం