మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 08:01:42

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

శామీర్‌పేట : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందిం ది. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం... తూంకుంట మున్సిపల్‌ పరిధిలోని అలంకృత సమీపంలో రాజీవ్‌ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని మహిళకు తీవ్ర గాయాలయ్యా యి. అటుగా వెళుతున్న ఓ వాహనదారుడు  గమనిం చి 108కు సమాచారం అందించాడు. ఆ వాహనం వచ్చేలోపు ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి  మహిళ వివరాల కోసం ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతు రాలి సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.