అంబర్‌పేట, అక్టోబర్ 20 : అంబర్‌పేట శంకర్ శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు రాఘవేంద్ర ముదిరాజ్, సాయికిరణ్ ముదిరాజ్, రమణ, నజయ్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ అంబర్‌పేట నియోజకవర్గంలో కాలేరు వెంకటేశ్‌ను ఎమ్మెల్యేగా రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు.