Amberpet | అంబర్‌పేట : ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. హైదరాబాద్ నగర పరిధిలోని అంబర్‌పేటకు చెందిన ఓ కుర్రాడు.. రష్యాకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. నల్లకుంట డివిజన్ విజ్ఞాన్‌పురి కాలనీకి చెందిన చలమలశెట్టి వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు అవినాష్ కార్తీక్, రష్యాకు చెందిన యాన్న ప్రేమించుకున్నారు. వీరిద్దరి పెళ్లికి కుటుంబాలు అంగీకరించడంతో హైదరాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో కుటుంబ సభ్యులందరి సమక్షంలో పెళ్లి ఘనంగా జరిగింది. ఈ జంటను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సోమవారం కలిసి అభినందించారు.