TSMSIDC | సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, రోగులకు ఎలాంటి మందుల కొరత లేదని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు వెల్లడించారు. ‘నమస్తే’లో ‘మందుల్లేవ్ ’ పేరుతో వచ్చిన కథనంపై టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు స్పందించారు.
సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌లో సరిపోను మందులు ఉన్నట్లు వివరణ ఇచ్చారు. రాజేంద్రనగర్ బుద్వేల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 3 నెలలకు సరిపోయేంత 4000 అంబ్రాక్సల్ దగ్గు మందు బాటీళ్లు అందుబాటులో ఉన్నాయని, సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌లో 5వేల టెస్టులకు సరిపోను 500 డెంగీ రాపిడ్ టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.