మణికొండ : ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్యశాఖ చేపడుతున్న మిషన్ ఇంద్రధనుష్ను ప్రజలంతా సద్వినియోగించుకోవాలని నార్సింగి ఆరోగ్యకేంద్ర వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ అన్నారు.
మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల గూడలో12మంది పిల్లలకు,నలుగురు గర్బిణీలకు టీకాలు ఇవ్వడంతో పాటు వారికి ఆరోగ్యవంతంగా ఉండేలా పలు అవగాహన సూచనలను ఇచ్చారు. అదేవిధంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాళీ మందిర్ ప్రాంతంలో పర్యటించి రెండు సంవత్సరాలలోపు పిల్లలకు టీకాలు అందజేశారు.
గర్బిణీలకు టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద్బరంగా వైద్యవిస్తరణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలంతా స్వచ్చంధంగా పాల్గొని ఆర్యోవంతమై సమాజాన్ని రూపొందించాలని కోరారు.
ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా వైద్యశాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. మిషన్ ఇంద్రధనుష్ ప్రజల ఆరోగ్యాలకు సంపూర్ణ భధ్రత కవచం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షణ అధికారి ఎం.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.