డ్రైవింగ్ పరీక్ష మరింత కఠినతరంగా మారనున్నది. ఇకపై స్టీరింగ్ కదలికలపై ఏఐ నిఘా ఉండనున్నది. ఏ మాత్రం డ్రైవింగ్‌పై అవగాహన లేకున్నా ఇట్టే పట్టేస్తుంది. ఇటీవల ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఒడిశాలో అక్కడి డ్రైవింగ్ పరీక్ష విధానాలపై ఇక్కడి అధికారులతో కూడిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ కమిటీ అధ్యయనం చేసింది. ఇక్కడ కూడా ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ విధానంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. మొదటి దశలో క్యూర్ పరిధిలోని 5 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లతో పాటు కరీంనగర్ ఆర్టీవో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ను ఆధునీకరించి, ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ విధానంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 ( నమస్తే తెలంగాణ ) : డ్రైవింగ్ పరీక్ష మరింత కఠినతరంగా మారబోతుంది. ఇకపై స్టీరింగ్ కదలికలపై ఏఐ నిఘా ఉండనుంది. ఏ మాత్రం డ్రైవింగ్‌పై అవగాహన లేకున్నా పట్టేస్తుంది. ఇటీవల ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఒడిశాలో అక్కడి డ్రైవింగ్ పరీక్ష విధానాలపై ఇక్కడి అధికారులతో కూడిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ కమిటీ అధ్యయనం చేసింది. అందులో భాగంగా ఇక్కడ కూడా ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ విధానంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు రవాణా శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.
జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్ బృందం మంగళవారం నగరంలోని కొండాపూర్, నాగోల్ డ్రైవింగ్ ట్రాక్‌లను హెచ్ఎండీఏ అధికారులతో కలిసి పరిశీలించింది. ఈ సందర్భంగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించి రహదారి భద్రతను పెంపొందించాలంటే డ్రైవింగ్ పరీక్షలు కఠినంగా, పారదర్శకంగా జరగాలని, పరీక్ష ప్రక్రియలో మానవ జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇటీవల ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ల కమిటీ సభ్యులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను సందర్శించి, అకడ అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించారని తెలిపారు. మొదటి దశలో కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 5 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లతో పాటు కరీంనగర్ ఆర్టీఓ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ను ఆధునీకరించి, ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ విధానంలో డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రఘునందన్, కొండయ్య, హెచ్ఎండీఏ అధికారులు శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, విక్రమ్, ఆరిటెక్ట్ ఆకాష్ రెడ్డి, కమిటీ సభ్యులు అమృత వర్షిణి, అభిలాష్ నాయక్, నేహా తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల కట్టడిపై చర్యలు
రాష్ట్రంలో 1.77 కోట్ల వాహనాలు ఉన్నాయి. గ్రేటర్లో 88 లక్షలకు మించి వాహనాలు ఉన్నాయి.ప్రతీ ఏడాది సుమారు 9.3 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నట్టు రవాణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 25,986 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇందులో 7,959 మంది మరణించారు. 23,658 మంది గాయాలపాలయ్యారు. 2024తో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య 10 శాతం పెరిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అలాగే మృతుల సంఖ్య కూడా 6.5 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాది కూడా రోడ్డు ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి. దేశంలో తెలంగాణ రోడ్డు ప్రమాదాలలో 8వ స్థానం, మరణాల్లో 10వ స్థానంలో ఉండటం ఆందోళన రేకెత్తిస్నున్నది. ఇలాంటి ప్రమాదాలను తగ్గించడానికి రవాణా శాఖ అధికారులు పాఠశాల విద్య నుంచే ట్రాఫిక్ పాఠాలపై దృష్టిసారించి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డ్రైవింగ్ ట్రాక్ల్లోనూ ఏఐని తీసుకొచ్చి నైపుణ్యం ఉన్న వారే స్టీరింగ్ పట్టేలా చర్యలు తీసుకోనున్నారు.
ఏఐ ఇలా పట్టేస్త్తుంది..!