మాదాపూర్, ఆగస్ట్ 26: ఆరోగ్య రంగం ఎదుగుదలతో పాటు భవిష్యత్తులో ‘ఆహా’ (ఏహెచ్హెచ్ఏ-అసోసియే షన్ ఆఫ్ హెల్త్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) చేయబో యే నేషనల్ కాన్ఫరెన్స్‌కు పూర్తిగా సహకరిస్తామని యశో ద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య అన్నారు. మాదాపూర్‌లోని యశోద హాస్పిటల్స్ హైటెక్స్ ఆధ్వర్యంలో శనివా రం ‘హెల్త్ కేర్‌లో లీడర్ షిప్ మేనేజ్మెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హెల్త్, మెడికల్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డా.గంగాధర్ విచ్చేసి యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డా.లింగయ్య విచ్చేసి ఆహా అధ్యక్షులు, డా.రమేష్, యశోద హాస్పిటల్స్ ఆర్గనైజింగ్ సభ్యులు రమేష్, సీఓఓ, డా.రవికిరణ్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య రంగం ఎదుగుదల, భవిష్యత్‌లో చేయబోయే నేషనల్ కాన్ఫరెన్స్‌కు పూర్తిగా సహకరిస్తామన్నారు. ప్రభు త్వ రంగ ఆరోగ్య పథకాలలో ఆహాను కూడా భాగస్వా మ్యం చేయాలని హెల్త్, ఓఎస్డీ డాక్టర్ గంగాధర్‌ను కోరా రు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ర్టాల నుంచి పలు ప్ర భుత్వ, ప్రైవేట్ దవాఖానల 100 మంది అధికారులు, నిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్, అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, దక్క న్ కాలేజీ, మల్లారెడ్డి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ నుంచి దాదాపు 200 మంది హాస్పిటల్స్ మేనేజ్మెంట్ విద్యార్థులు హాజరయ్యారు.