మన్సూరాబాద్, జనవరి 30: రైతు వ్యతిరేక చట్టాలపై ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి ఆరోపించారు. మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్‌లోని పారిశ్రామిక వాడలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు చట్టాలపై ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ.. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు భీమనపల్లి కనకయ్య, దోనూర్ కృష్ణారెడ్డి, భాస్కర్, సీహెచ్. మల్లేశం, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.