మూసాపేట, సెప్టెంబర్ 29: కేబుల్ లైన్ వేయడానికి తవ్వుతున్న క్రమంలో పైన మట్టి కూలి ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. రంగనాయకస్వామి ఆలయం సమీపంలోని హానర్స్ కన్స్ట్రక్షన్లో బీహార్‌కు చెందిన రవికుమార్ (20) కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఆదివారం అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ లైన్ కోసం తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలు జరుగుతున్న క్రమంలో రవికుమార్‌పై ఒక్కసారిగా మట్టి కూలింది. ఆ మట్టిలో చిక్కుకున్న రవికుమార్‌ను తోటి కార్మికులు గమనించి.. వెంటనే మట్టి నుంచి అతడిని బయటకు తీసి స్థానిక దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.