రైలు ఢీకొని మృతి
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం సికింద్రాబాద్ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన బాబు (33) బార్బర్.
మారేడ్‌పల్లి, జూలై 15: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం సికింద్రాబాద్ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన బాబు (33) బార్బర్. సోమవారం ఉదయం 4.30 గంటలకు దుకాణానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. 6.10 గంటల సమయంలో గౌడవెల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నంబర్ 1 నుంచి మూత్ర విసర్జన కోసం పట్టాలు దాటుతుండగా, రైలు ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
శేరిలింగంపల్లి, జూలై 15: వాహనం ఢీకొని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం.. రాయదుర్గం ప్రాంతానికి చెందిన సోము సాంబశివరావు (30) మోటర్ సైకిల్‌పై తిరుగుతూ టిఫిన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. సోమవారం ఉదయం సాంబశివరావు రాయదుర్గం వైపు నుంచి మాదాపూర్ మైండ్ స్పేస్ జంక్షన్ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో ఉన్న గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఫ్లై ఓవర్ పైనుంచి ఎగిరి కిందపడ్డ సాంబశివరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
రైల్లో యువకుడి..
కాచిగూడ, జూలై 15: కొంగు రైల్లో ఓ యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి కథనం ప్రకారం.. కీసర పరిధిలోని రాంపల్లి ప్రాంతానికి చెందిన చెన్నయ్య దర్గా (28) కూలీ. సోమవారం ఉదయం కాచిగూడ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం-1లో ఆగి ఉన్న కొంగు రైల్లోని జనరల్ బోగీలో అనారోగ్యంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లక్ష్మణాచారి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

