Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో వ్యభిచారం ముఠా గుట్టురట్టు అయింది. మూసా నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు.
చాదర్‌ఘాట్ మూసా నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో చాదర్‌ఘాట్ పోలీసులు తెలంగాణ స్పెషల్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. మయన్మార్‌కు చెందిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇక వ్యభిచారం దందా నిర్వహిస్తున్న వారితో పాటు విటులను అరెస్టు చేశారు.
మయన్మార్, పశ్చిమ బెంగాల్ నుంచి మహిళలను అక్రమంగా తరలించి, ఇక్కడ బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యభిచారం రాకెట్ వెనుక ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Prostitution Racket busted in Hyderabad’s Chaderghat. @TheSiasatDaily #Hyderabad pic.twitter.com/IwHGsnEiNV
— Mohammed Baleegh (@MohammedBaleeg2) February 25, 2025