ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 3 : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని(KCR birthday) పురస్కరించుకుని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్(Cricket tournament) (కేసీఆర్ కప్ – 2024) ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఉపయోగపడతాయని అన్నారు. క్రీడాకారుల్లో ఉత్సాహంతో పాటు మానసికోల్లాసానికి సైతం వీటితో పెంపొందించవచ్చన్నారు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేలు, రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.25 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేస్తామని వివరించారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు శిగ వెంకటేశ్‌గౌడ్, మల్లేశ్, సురేశ్, రాజు, చందు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.