హైదరాబాద్ : బోయిన్పల్లి(Boinpally)లో ఓ కారు బీభత్సం(Havoc) సృష్టించింది. అతివేగంగా వచ్చి మరో కారును ఢీ కొని(Car accident) ఆ తర్వార రోడ్డు పక్కనే ఉన్న విగ్రహాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమదంలో కారులో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. బోయిన్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.