Balkampet Temple | బల్కంపేట ఎల్లమ్మకు రూ.4.4 కోట్లు
స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.1400 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 52 పర్యాటక ప్రాజెక్టులను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందులో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.4.4 కోట్లు కేటాయించారు.
- స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపు
- వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి
Balkampet Temple | అమీర్పేట్, మార్చి 7 : స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.1400 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 52 పర్యాటక ప్రాజెక్టులను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందులో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.4.4 కోట్లు కేటాయించారు. గురువారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన స్క్రీన్ ద్వారా కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆలయంలో అన్నదాన భవనం, వర్షపు నీటి సంరక్షణ, వరదనీటి పైపులైన్ల వ్యవస్థ, బయో టాయిలెట్స్, ఆలయ ప్రహరీగోడలు, గేట్లు, సీసీ టీవీ కెమెరాలు, సైనేజెస్, డీజే సెట్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, మహంకాళి (సికింద్రాబాద్) జిల్లా అధ్యక్షుడు బూర్గుల శ్యాంసుందర్గౌడ్, అమీర్పేట్ కార్పొరేటర్ సరళ, దేవాలయ ఈవో నాగరాజు, ఆలయ చైర్మన్ సాయిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సంచలన ఆరోపణలు
Horoscope | 13-10-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
పంట చేతికొచ్చేనా..?
జంతర్ మంతర్కు నిరసన వేదిక హోదా రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

