ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Mar 23, 2020 , 00:58:31

నేను భాగ్యనగరాన్ని..

నేను భాగ్యనగరాన్ని..

  • ఇండ్లకే పరిమితమైన నగరవాసులు
  • కరోనాపై పోరాటానికి స్వచ్ఛందంగా ముందుకు
  • వైద్య ఆరోగ్య సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం

చారిత్రక వారసత్వ సంపదకు ప్రతీకను.. 

ముత్యాలనగరమనే కీర్తిని గడించాను..

కాలుష్యంలేని ఆహ్లాద వాతావరణం, 

అందాల తోటలు, భవనాలతో కళకళలాడాను.. 

ప్రాంతం, వర్ణ  భేదాలు లేకుండా అందరికీ ఆశ్రయమిచ్చాను..


గిర్రున తిరిగిన కాలచక్రంలో..  భరించలేనంత భారాన్ని మోస్తున్నాను.. 

పెరిగిన కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీతో ఇబ్బంది పడుతున్నాను..

విశ్రాంతి కోసం ఆదివారాలు, సెలవులు ఎప్పుడోస్తాయా అని ఎదురుచూస్తున్నాను

అప్పుడప్పుడు దొరికే కాస్త సమయంతోనే ఉపశమనం పొందుతున్నాను..


ఏమైందో ఏమో.. ఈ ఆదివారం నాకు ఎన్నడులేనంత స్వేచ్ఛ లభించింది..

కరోనా.. జనతా కర్ఫ్యూతో  నిండుగా ఊపిరి పీల్చుకున్నాను..

రద్దీలేని రోడ్లు.. కాలుష్యంలేని వాతావరణంతో సేదతీరాను..

 జనతా కర్ఫ్యూతో నాకు నేనే కొత్తగా అనిపించాను.. 


logo