సోమవారం 30 మార్చి 2020
Hyderabad - Mar 18, 2020 , 03:22:50

అవసరమైతే..అర్ధరాత్రి వరకు ట్యాంకర్లు

అవసరమైతే..అర్ధరాత్రి వరకు ట్యాంకర్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సాధారణంగా వేసవిలో ట్యాంకర్‌ నీటికి డిమాండ్‌ ఉంటుంది. గతేడాది జలమండలి చరిత్రలోనే లేనంతగా రికార్డుస్థాయిలో ఒక్కరోజే లక్షా 52వేల బుకింగ్స్‌ రాగా సకాలంలో ట్యాంకర్‌ నీరు అందక నీటి ఎద్దడి తలెత్తింది. గతేడాది డిమాండ్‌ దృష్ట్యా జలమండలి ఆప్రమత్తమైంది. ఆపరేషన్‌ ట్యాంకర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని 48గంటల్లో ట్యాంకర్‌ అందించడమే లక్ష్యంగా చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల సమీక్షలో ఎండీ దానకిశోర్‌ ట్యాంకర్ల ఆలస్యాన్ని ఉపేక్షించేది లేదని, 48 గంటల్లో ట్యాంకర్‌ నీరు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. ఈ దరిమిలా ప్రస్తుతం సంస్థ పరిధిలో ఉన్న 1,110 ఫిల్లింగ్‌ స్టేషన్లకు అదనంగా ఐదుచోట్ల ఏర్పాటు చేయాలని స్థానిక మేనేజర్లు ప్రతిపాదించారు. ఔటర్‌ గ్రామాల్లో అదనంగా 17 ఫిల్లింగ్‌ స్టేషన్లు, 60 ట్యాంకర్లను సమకూర్చారు. వీటితోపాటు 837 ట్యాంకర్లను అదనంగా 48 ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పైపులైన్ల ద్వారా సమృద్ధిగా నీటి సరఫరా అం దిస్తూనే ట్యాంకర్‌పై అధారపడిన ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేయడమే లక్ష్యంగా తీసుకుంటున్నారు.

అవసరమైతే అర్ధరాత్రి కూడా ... 

లోప్రెషర్‌, బోర్లు ఎండినపోయిన ప్రాంతాలు, కలుషిత నీటి సమస్యలు ఎదురయ్యే ప్రాంతాలు, పైపులైన్‌ వ్యవస్థ లేని ఏరియాలు, బస్తీలు, వాణిజ్య సంస్థల నుంచి అత్యధికంగా వాటర్‌ ట్యాంకర్‌ నీరు అవసరం ఉంటుంది. ఐతే ఈఏడాది మార్చిలోనే ట్యాంకర్‌ నీటికి డిమాండ్‌ మొదలైంది. మంగళవారం ఒక్కరోజే 87వేల ట్యాంకర్‌ బుకిం గ్స్‌ నమోదయ్యాయి. మేలో రెట్టింపయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ట్యాంకర్‌ డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాం గం సిద్ధమైంది. రోజూవారీ ట్యాంకర్‌ బుకింగ్స్‌ ఆధారంగా ట్రిప్పుల సంఖ్యను పెంచనున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న ట్యాంకర్‌ సరఫరాను అవసరమైతే అర్ధరాత్రి వరకు అందుబాటులోకి ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. స్వయంగా ఎండీ దానకిశోర్‌ ఆన్‌లైన్‌ నిరంతర పర్యవేక్షించేలా ఉన్నతాధికారు లు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా మంచినీటి సరఫరా ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణకు 10 మంది ప్రత్యేకాధికారు లు పనిచేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటిం చి, ఎక్కడైనా మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే అక్కడ నల్లాలు, ట్యాం కర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేలా ఈ ప్రత్యేకాధికారులు చ ర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న మంచినీటి సరఫరా, లోప్రెషర్‌ పను లు, ఫిల్లింగ్‌ స్టేషన్లు పరిశీలించి ఏవైనా సమస్య లు ఉంటే వెంటనే పరిష్కరించడానికి 100 మందితో థర్డ్‌పార్టీ తనిఖీలు చేపడతామన్నారు. 

 ఔటర్‌ గ్రామాల్లో 

అదనంగా ఫిల్లింగ్‌ స్టేషన్లు 

పీరంచెరువు, కిస్మత్‌పూ ర్‌ (150 కెఎల్‌/భవానీ నగర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌), నార్సింగి హైట్స్‌, మణికొండ(2.2 ఎంఎల్‌/నార్సింగి హైట్స్‌), బాలాపూర్‌, సాహెబ్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, శ్రీరాంన గర్‌, తుర్కయాంజల్‌, జవహర్‌నగర్‌, తూంకుంట, ప్రగతినగర్‌, గండిమైసమ్మ, కొంపల్లి, శంషాబాద్‌,  ఆమీన్‌పూర్‌, హెచ్‌ఎంటీ కాలనీ, బొల్లారం సంపు, తెల్లాపూర్‌, కిష్ణారెడ్డిపేట, బీరంగూడ ప్రాంతాల్లో ఫిల్లింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.  


logo