ఆదివారం 24 మే 2020
Hyderabad - Feb 17, 2020 , 01:09:06

సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం

సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంస్కృతి,సం ప్రదాయాలు పరిరక్షించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నా రు. పిర్జాదిగూడ నగరపాలక పరిధి మేడిపల్లిలోని శ్రీవీరాంజనేయ ఆలయం

  • సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి

 మేడిపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంస్కృతి,సం ప్రదాయాలు పరిరక్షించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నా రు. పిర్జాదిగూడ నగరపాలక పరిధి మేడిపల్లిలోని శ్రీవీరాంజనేయ ఆలయం వద్ద ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన గిరిజన జాతి ఆరాధ్య దైవం శ్రీ సద్గురు సంత్‌సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి (బోగ్‌భండార్‌) కార్యక్రమం ఆదివారం కార్పొరేటర్‌ సుభాశ్‌నాయక్‌, బంజారా వెల్ఫేర్‌ అసోసియేషన సభ్యులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి, నగరపాలక మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక గిరిజన నాయకులతో కలిసి సేవాలాల్‌ చిత్రపటానిక పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..సేవాలాల్‌ సద్దురు సేవాలాల్‌ చూపిన మార్గంలో సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని, ప్రతిఒక్కరూ సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సంత్‌లాల్‌ జయంతి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు కేటాయించిదన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం గిరిజనులకు అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. నగరంలో ని బంజారాహిల్స్‌లో ఎకరం భూమిలో బంజార భవనం నిర్మిస్తున్నారని, బంజారాల కోసం మేడిపల్లిలో భవనం నిర్మిస్తామన్నారు.


నగరపాలక మేయర్‌ మాట్లాడుతూ భగవత్‌తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి కొంతమంది పురా ణపురుషులు అవతరిస్తే.... బంజార జాతుల భవిష్యత్‌ గమనానికి బాటలు వేసిన చైతన్య దీప్తిస్వరూం సేవాలాల్‌ మహరాజ్‌ అన్నారు. కార్యక్రమంలో మంత్రి మాల్లారెడ్డి క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాష్ట్రస్థాయిలో అండర్‌ 16లో రాణిస్తున్న పిర్జాదిగూడ నగరపాక పరిధి పర్వతాపూర్‌కు చెందిన గిరిజన క్రీడాకారిణి కావ్యశ్రీని అభినందించి రూ.10వేలు అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ,  అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో జేసీ విద్యాసాగర్‌, తహసీల్దార్‌ అనిత, ఎస్సీస్టీ మేడ్చల్‌ ఇన్‌చార్జి ధనరాజ్‌నాయక్‌, డిప్యూటీ మేయర్‌ కుర్ర శివకుమార్‌ గౌడ్‌, కార్పొరేటర్లు యుగేందర్‌రెడ్డి, హరిశంకర్‌రెడ్డి, శారదఈశ్వర్‌రెడ్డి, వసంత శ్రీధర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, పిట్టల మల్లేశ్‌, పద్మారెడ్డి, బంజారా వెల్ఫేర్‌ సభ్యులు సురేశ్‌నాయక్‌, రామ్‌కోఠినాయక్‌, రాజేశ్‌నాయక్‌, శుక్రునాయక్‌, భగవంతు, నాయకులు పాల్గొన్నారు. 


logo